డబ్బు మదంతో మాట్లాడుతున్నారు
గత కొన్ని రోజులుగా పోలీసులపై అల్లు అర్జున్ నిందలు వేస్తున్నారని ఏసీబీ విష్ణుమూర్తి మండిపడ్డారు. డబ్బు మదంతో ఓ హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. బందోబస్తుకు కొన్ని నియమాలు ఉంటాయని, అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి తెలిపారు. పోలీసులను నోటికి వచ్చిన్నట్టు కొందరు నటులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. అందరు పనులు చేసుకుంటే పోలీసులు రోడ్ల మీద ఉంటారన్నారు. సమాజం కోసం పోలీసులు అన్ని వేళలో అందుబాటులో ఉంటారని ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు.