తానా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి
అమెరికాలో జరిగిన తానా సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకులు రేవంత్ రెడ్డిని సన్మానించారు. అనంతరం ఏపీ, తెలంగాణ రాజకీయాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి, పోలవరాన్ని కాంగ్రెస్ పార్టీనే నిర్మిస్తుందన్నారు. రేవంత్ అంటే కాంగ్రెస్-కాంగ్రెస్ అంటే రేవంత్ అన్నారు. రేవంత్ చేసి వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. దిల్లీలో వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ వంటి ప్రముఖులు ఉన్నపుడు దిల్లీలో తెలుగువారికి అవకాశం ఉందని నమ్మేవారని, ఇప్పుడు దిల్లీలో తెలుగు వారికి ఆ అవకాశం లేదన్నారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీయే నిర్మి్స్తుందనే విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారన్నారు.