ఆదిపురుష్ డిజాస్టర్.. బాలీవుడ్ హ్యాపీ

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ అంటూ నార్త్‌లో పాగా వేస్తున్నారు. ఇక్కడ టాలీవుడ్ దర్శకులు, హీరోలు ముంబై వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తూ నార్త్ ఆడియన్స్‌ని మచ్చిక చేసుకుని సినిమాలతో విజయం సాధించడం, బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ మూవీస్ అన్ని వరసగా వైఫల్యాలు పొందడంతో అక్కడి ప్రముఖులు సౌత్ ఇండస్ట్రీపై గుర్రుగా ఉన్నారు. నెలకో భారీ డిజాస్టర్ రావడం హిందీ వాళ్లకి అలవాటుగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలని నెత్తిన పెట్టుకుంటున్నారు.

బాహుబలి దగ్గర మొదలై KGF, ఆర్.ఆర్.ఆర్, పుష్ప, కాంతార, కార్తికేయ 2.. ఇలా పాన్ ఇండియా మూవీస్ అన్ని నార్త్ బాక్సాఫీసు దగ్గర సునామి సృష్టించాయి. ఇక్కడి హీరోలని, దర్శకులని పొగుడుతున్నా.. ఆస్కార్ అప్పుడు వాళ్ల అసంతృప్తిని క్లియర్‌గా బయటపడింది. ఒక్కరు కూడా రాజమౌళిని, ఆర్.ఆర్.ఆర్ టీమ్‌ని అప్రిషియేట్ చెయ్యలేదు. బాలీవుడ్ ప్రముఖుల మనసులో బాధ కనిపిస్తూనే ఉంది. అదంతా ఇప్పుడు ఆదిపురుష్ విఫలమవడంతో వారు ఆనందంతో పండగ చేసుకున్నా చేసుకుంటారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌కి నెగెటివ్ టాక్, డిజాస్టర్ టాక్ రావడంతో వారిలో సంతోషం మొదలయ్యే ఉంటుంది. బాహుబలి మానియాతో సాహో ప్లాప్ అయినా నార్త్ ఆడియన్స్ దానికి అదిరిపోయే హిట్ కలెక్షన్స్ ఇచ్చారు. 

ఇప్పుడు ఆదిపురుష్ కూడా అంతే అనుకుంటే నార్త్ ఆడియన్స్‌కి ఏ కోశానా ఎక్కలేదు. అలాగే బాలీవుడ్ మీడియా, క్రిటిక్స్ అంతా ఆదిపురుష్ ప్లాప్‌పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నారు. తమ సినిమాలే కాదు సౌత్ సినిమాలు కూడా డిజాస్టర్ అవుతాయి చూడమంటూ సోషల్ మీడియాలో ఆదిపురుష్ పై విషం చిమ్ముతున్నారు. ప్రభాస్ మాత్రమే సౌత్ నుండి ఉన్న హీరో. మిగతా ఆదిపురుష్ బ్యాచ్ దర్శకుడు, నిర్మాతలు, స్టార్స్ అంతా హిందీ వాళ్ళే. అయినా హీరో ప్రభాస్ కదా అదే వారిని సంతోషపెట్టేది.

Source link