ఆదిలాబాద్ లో మండుతున్న ఎండలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు..-the scorching sun and groundwater scarcity in adilabad ,తెలంగాణ న్యూస్

తాగునీరు కు ఇబ్బందులు:

ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భూగర్భ జలాలు 8.68 మీటర్ల లోతుకు అడుగంటిపోయాయి. దీంతో చేతిపంపులు, వాగులు, బావులు ఎండి పోవడంతో స్థానిక నీటి వనరులు సమస్యాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడం, పైప్లైన్ లీకేజీల కారణంగా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండలు, గుట్టలు దాటి నీటి జాడల కోసం వెతుక్కుంటూ తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, ఇప్పటి నుంచే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమవుతుందని రైతులు, సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Source link