ఆర్భాటంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం… కొనడంలో ఆలస్యం..! ఆందోళనలో అన్నదాతలు-the process of paddy procurement in the joint karimnagar district is going on slowly ,తెలంగాణ న్యూస్

అన్ని కేంద్రాలను అధికారులు పాలకులు ఆర్బాటంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎక్కడ ఒక బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదు.‌ పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకునేందుకు అన్నదాతల పాట్లు మరో ఎత్తుగా మారింది. సాగు మొదలుకుని చీడపీడలు, అకాల వర్షాలతో దిగుబడులపై ప్రభావం.. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డ రైతులు పంట అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ధాన్యం ఎండి కాంట పెట్టడానికి సిద్దంగా ఉన్నా ఎప్పుడు కాంట పెడుతారో తెలియక ఎండిన ధాన్యాన్ని కుప్ప పోసి దినంగా ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కాక, అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది.

Source link