చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్.. ఆసియాకప్ గ్రూప్ దశలో రెండు మ్యాచ్‍ల్లో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‍లు శ్రీలంకలోని దంబుల్లాలో నిర్వహించేందుకు బీసీసీఐ, పీసీబీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో దంబుల్లాలో భారత్, పాక్ మ్యాచ్‍లు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ చేరితే.. అది కూడా దంబుల్లా వేదికగా జరగనుంది.