యాషెస్ సిరీస్‍లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియాకు 10 డబ్ల్యూటీసీ పాయింట్లు, ఇంగ్లండ్‍కు 19 పాయింట్ల కోత విధించింది ఐసీసీ. యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టుకు రెండు పాయింట్లు, రెండో టెస్టుకు తొమ్మిది, మూడో టెస్టుకు మూడు, ఐదో టెస్టుకు ఐదు పాయింట్లను కోల్పోయింది ఇంగ్లండ్. ఇక నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా 10 పాయింట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. అయితే, వర్షం అంతరాయాలు కలిగినా నాలుగో, అయిదో టెస్టుల్లో ఓవర్ రేట్‍ను లెక్కించి డబ్ల్యూటీసీ పాయింట్లను కోత విధించడంపై ఐసీసీపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.