దరఖాస్తును తిరస్కరించడమంటే… రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోని పలు ఆర్టికల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని తెలిపింది. నో క్యాస్ట్.. నో రిలీజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.