కారణాలు ఇవేనా…?
ఆర్ఎస్పీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపటానికి పలు ప్రధాన కారణాలు తెరపైకి వస్తున్నాయి. జనరల్ స్థానమైన సిర్పూర్ నియోజకవర్గం నుంచి 2014 లో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా అనూహ్య విజయం సాధించారు. ఆ తరువాత… గులాబీ గూటికి చేరారు. అయితే ఆ ఎన్నికల సమయంలో…. పలు గ్రామాల్లో పార్టీ సింబల్( ఏనుగు) సుపరిచితమైంది. ఇదే కాకుండా…. ఇక్కడ ఎస్సీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా… స్థానికంగా ఉన్న పలు పరిశ్రమల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువ ఉంది బహుజన వాదాన్ని విశ్వసించే వారు ఉండటం కూడా…. పార్టీకి కలిసి వస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ, గిరిజన ఓటు బ్యాంక్ పై కూడా బీఎస్పీ ఫోకస్ పెట్టింది. ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కోనప్ప… అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. ఆదివాసీ, గిరిజనులపై నమోదైన కేసుల విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. వీటికి తోడు బీసీల ఓట్లపై కూడా ఆశలు పెట్టుకుంది బహుజన సమాజ్ పార్టీ. ఇక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రవీణ్ కుమార్ కు పేరు ఉండటంతో పాటు…గతంలో గురుకులాను అభివృద్ధి చేశారన్న పేరు ఉంది. వీటికి తోడు బీఆర్ఎస్ వైఫల్యాలపై కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీక్ కేసులోనూ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ వస్తున్నారు. అన్ని అంశాలను అంచనా వేసిన తర్వాతనే…. జనరల్ సీటుగా ఉన్న సిర్పూర్ నుంచి పోటీ చేయాలని ఆర్ఎస్పీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.