ఇండియన్ 3 పై క్రేజీ అప్ డేట్

ఇండియన్ 2 సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనే ఓ అతి పెద్ద అపజయంగా మిగిలింది. దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా సూపర్ హిట్ అవడంతో దర్శకుడు శంకర్ దీనికి సీక్వెల్ తీర్చిదిద్దాలని భావించాడు. అయితే కథా కథనాల్లో సరైన బలముండకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఇండియన్ 3 సినిమా వస్తుందా..? రాదా..? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

దర్శకుడు శంకర్ ఇటీవల ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ విడుదలైన తర్వాత ఇండియన్ 3 పనులను మొదలు పెడతానని తెలిపారు. అయితే ఫ్యాన్స్ మాత్రం దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 3 సినిమాను పూర్తి చేయడానికి సిద్ధమవుతోందట.

ఇంతలో ఇండియన్ 2 సినిమాలో వదిలిపెట్టిన పారా అనే పాటను ప్రత్యేక వీడియో రూపంలో విడుదల చేసి అందులో ఇండియన్ 3 విజువల్స్ ను కూడా జత చేశారు. ఈ టీజర్ ని చూసిన వారిలో సినిమా పై కొంత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అసలు కథ మొత్తం ఇండియన్ 3 లోనే కొనసాగనుంది అనే అభిప్రాయం కలుగుతోంది.

ఇండియన్ 2 సినిమాను కేవలం బ్రాండ్ ను క్యాష్ చేసుకునేందుకు మాత్రమే తెరపైకి తీసుకువచ్చారు. అయితే కమల్ హాసన్ వంటి స్టార్కు ఉన్న క్రేజ్ కారణంగా సరైన ప్రమోషన్ చేస్తే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటానికి ముందు సేనాపతి పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఈ మూడో భాగంలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇండియన్ 3 సినిమా విడుదల విషయానికి వస్తే దీని కంటే ముందుగా మణిరత్నం తెరకెక్కిస్తున్న తగ్ లైఫ్ సినిమా రాబోతోంది. ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది కాబట్టి అది హిట్ అయితే కమల్ హాసన్ తదుపరి సినిమాపై ఆటోమేటిక్ గా మంచి బజ్ వస్తుందని లైకా భావిస్తోంది. అందుకే సారా పాటలో ఇండియన్ 3 కు సంబంధించిన కొత్త విజువల్స్ ను జత చేశారు.

Source link