ఓ నివేదిక ప్రకారం, 2023 ODI ప్రపంచ కప్‌కు ముందు ఏర్పాట్లను సమీక్షించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తన భద్రతా బృందాన్ని భారతదేశానికి పంపే అవకాశం ఉంది. ఎప్పుడు పంపిస్తారన్న దానిపై స్పష్టత లేదు. పీసీబీ భద్రతా బృందం అన్ని ప్రపంచకప్ వేదికలను సందర్శించిన తర్వాతే, బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెబుతున్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా.. మొత్తం 5 స్థానాలను పీసీబీ భద్రతా బృందం సందర్శిస్తుంది. ఆ తర్వాత బోర్డుకు నివేదికను సమర్పిస్తుందని సమాచారం.