టాటా IPL 2023 సమయంలో జియోసినిమా(Jio Cinema) దూసుకెళ్లింది. కోట్ల మంది వీక్షకులను సొంతం చేసుకుంది. ఇప్పుడు వ్యూయర్స్ మళ్లీ జియోసినిమాను ఉపయోగించేందుకు స్ట్రాటజీలు ఫాలో అవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా క్రికెట్ అభిమానులకు వారి ఇష్టమైన క్రీడను ఉచితంగా అందజేయడం కొనసాగిస్తుంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ వీక్షకులు పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లను తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, భోజ్పురి, పంజాబీ, తమిళం భాషల్లో కామెంటరీతో చూడవచ్చు. ఏడు భాషల్లో ద్వైపాక్షిక సిరీస్ ప్రసారం కావడం ఇదే తొలిసారి.