రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదరు చూస్తున్నారు. ఈ స్కీమ్ కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకోగా… ప్రస్తుతం ప్రభుత్వం యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుపుతోంది. సంక్రాంతిలోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.