ఇకపై జగన్ నిర్ణయమేమిటో

ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికార పక్షాన్ని ఎదురించి నిలబడి 2029 ఎన్నికల్లో గెలిచే పని పక్కన పెట్టి పార్టీలో అంతర్గత కలహాలు, అలాగే పార్టీ నుంచి వెళ్లిపోయేవారిని బుజ్జగించడం, వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయేవారిని జైలుకు పంపిస్తుంటే ఓదార్చడం, పార్టీ నుంచి వెళ్ళివారిపై కౌంటర్ ఎటాక్స్ చేసుకోవడానికే జగన్ కి టైమ్ సరిపోతుంది. 

ఆఖరికి తన చుట్టూ ఉన్న కోటరీ గురించి తాను పెంచి పోషించిన బ్లూ మీడియానే నెత్తినోరు కొట్టుకుంటుంటే.. జగన్ కి మాత్రం వినిపించడం లేదు, తన రైట్ హ్యాండ్ అనుకున్న విజయసాయి రెడ్డి కూడా జగన్ కోటరీ కామెంట్స్ చెయ్యడం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో చూసారు. విజయ్ సాయి రెడ్డి లాంటి స్ట్రాంగ్ పర్సన్ పార్టీని వీడడమనేది నిజంగా పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. 

దానితో సోషల్ మీడియాలో చాలామంది వైసీపీ పై, జగన్ పై కామెంట్స్ కాదు కాదు కామెడీగా ట్వీట్లు చేస్తున్నారు. జగన్ కుడి భుజం విజయ్ సాయి రెడీ వెళ్లిపోయే, జగన్ నమ్మినబంటు YV సుబ్బారెడ్డి పార్టీ విషయాలు పట్టించుకోకుండా సైలెంట్ అయ్యాడు, జగన్ కి ఆప్తుడైన పెద్ది రెడ్డి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. 

పార్టీలో జగన్ కు ఇక సజ్జల తప్ప మరెవ్వరు లేరు అంటూ మాట్లాడుతున్నారు. అసలు పార్టీ బ్రష్టుపట్టిపోవడానికి సజ్జల రామకృష్ణ రెడ్డే అంటూ ఎప్పటినుంచో అంటే 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి సజ్జలను జగన్ నమ్మడం వలనే పార్టీకి ఈ గతి అంటూ బ్లూ మీడియా చెబుతూనే ఉంది. 

మరి జగన్ ఇప్పటికైనా కోటరీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, సజ్జలను పక్కనబెడతారో, లేదో అనే విషయంలో వైసీపీ కార్యకర్తలే చాలా ఆతృతగా కనబడుతున్నారు. 

Source link