ఇక ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని చదువుకునే విద్యార్థుకుల కూడా ఫీజు రియింబర్స్‌మెంట్ కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. దీంతో సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ కష్టమైంది. 2019 మే నాటికి దాదాపు రూ.3500కోట్ల బకాయిలు ఉండిపోయాయి. 2024 మార్చిలో జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేసినా అవి విద్యార్థుల ఖాతాలకు చేరలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. 1,2, 3 ఇయర్ చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించడానికి కాలేజీలు నిరాకరించడంతో ఎవరికి వారు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది.