ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర అల్పసంఖ్యక వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సభలో చర్చ జరుగుతోంది. ఓ కీలక విషయాన్ని బిల్లులో పొందుపరిచారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఏదైనా ప్రభుత్వ ఆస్తిని, గతంలోగానీ, యాక్ట్ వచ్చిన తరువాత గానీ గుర్తిస్తే దానిని ఇక వక్ఫ్ భూమిగా పరిగణించరని బిల్లులో పేర్కొన్నారు. ఏదైనా అలాంటి భూమి విషయంలో సందేహాలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చినా జిల్లా కలెక్టర్ దానిపై విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. కలెక్టర్ అలాంటి ప్రాపర్టీ గుర్తిస్తే అది ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అలాంటి ప్రాపర్టీని గుర్తిస్తే, కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేవరకు ఆ భూములను వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించకూడదు.

కలెక్టర్ కనుక ఆ భూములను ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారిస్తే, రెవెన్యూ రికార్డులలో దానిపై మార్పులు చేర్పులు చేయాలి. అలాంటి ప్రాపర్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ తన నివేదిక సమర్పించాలని వక్ఫ్ సవరణ బిల్లులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ నుంచి నివేదిక తీసుకున్న అనంతరం రికార్డులలో మార్పులు చేసుకోవాలని బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.

పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి..

వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఉభయ సభల సంయుక్త కమిటీలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగినంగత చర్చ ఎన్నడూ జరగలేదు. జాయింట్ పార్లమెంట్ కమిటీ (ఉమ్మడి కమిటీ) సభ్యులందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు అన్ని మతాలు, సామాజిక వర్గాల వారు మొత్తం 284 ప్రతినిధులు తమ అభిప్రాయాలను, సూచనలను కమిటీకి సమర్పించారు. 25 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు సైతం తమ అభిప్రాయాలను సమర్పించాయి” అన్నారు.

ప్రతిపక్షం విమర్శలను పట్టించుకోం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “…జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. కానీ మాకు కాంగ్రెస్ లాంటి కమిటీ లేదు. మాకు ప్రజాస్వామ్య కమిటీ మాత్రమే ఉంది, అది మేధోమథనం చేసి నిర్ణయం తీసుకుంటుంది. ‘కాంగ్రెస్ కే జమానే మే కమిటీ హోతీ థి జో తప్పా లగతీ థి’. మా కమిటీ చర్చల ఆధారంగా చర్చిస్తుంది, మార్పులు చేర్పులు చేస్తుంది. మార్పులను అంగీకరించకపోతే, ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రయోజనం ఏమిటి?” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link