ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల రాస్తారోకో, 4 గంటల పాటు బాసర నిర్మల్ హైవే నిర్భంధం-nirmal farmers protest against ethanol factory basar nirmal highway heavy traffic jam ,తెలంగాణ న్యూస్

రాస్తారోకో కారణంగా బాసర నిర్మల్ లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక వాహనాలను పోలీసులు దారి మళ్లించి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. అయినప్పటికీ భారీ వాహనాలు మాత్రం రోడ్డు పైనే నిలిపి వేచి చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీఓ రత్నకుమారి నిరసన స్థలానికి చేరుకొని ప్రజలతో మాట్లాడారు, ఆమె శాంతియుతంగా ధర్నా చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా చేసే ధర్నాను చట్టం గౌరవిస్తుందని, రాస్తారోకో చేయడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నది తక్షణమే విరమించాలని కోరారు, అయినప్పటికీ ప్రజల వినకుండా ధర్నా కొనసాగించారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు రాస్తారోకోను విరమించేది లేదని పేర్కొన్నారు. ప్రాణ త్యాగమైనా చేస్తామని రాస్తారోకో విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. పరిస్థితి విషమించడంతో ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు.

Source link