ఇలాంటి పిక్స్ వస్తే ఫాన్స్ ఆగుతారా..

సలార్ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ప్రభాస్ ఫాన్స్ పనిగట్టుకుని దానిని వైరల్ చేస్తూ ఆనందిస్తున్నారు. సలార్ అప్ డేట్స్ లేటయితే లీకెడ్ పిక్స్ ని వైరల్ చేసేవారు. ఇక సలార్ విడుదల డిసెంబర్ 22 కి మారినప్పటినుంచి సలార్ పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి కానీ.. సోషల్ మీడియాలో సలార్ హవా ఓ నెల ముందు అంతగా కనిపించలేదు. ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ చేశాకే సలార్ సందడి మొదలయ్యింది.

అంతకుముందు సలార్ పిక్స్ వదలమని, ట్రైలర్ అప్ డేట్ ఇవ్వమని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైట్ చేసారు. అయినా మేకర్స్ సైలెంట్ గానే ఉన్నారు. ఇక రేపు డిసెంబర్ 1 న సాయంత్రం సలార్ ట్రైలర్ విడుదల కాబోతుంది. రెండు రోజులుగా మేక్స్ సోషల్ మీడియాలో ఇచ్చే హైప్ కి అభినులు రెచ్చిపోయి సలార్ హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు గురువారం సలార్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ స్క్రిప్ట్ డిస్కర్షన్ పిక్ రిలీజ్ చేసారు. సలార్ సెట్ లో ప్రశాంత్ నీల్-ప్రభాస్ పిక్ అది.

ఆ పిక్ చూసి ప్రభాస్ ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇవే కదా మేము అడిగేది. ఇలాంటి పిక్స్ వస్తే వదులుతామా అని వారు ఆ పిక్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి మరీ ఆనందిస్తున్నారు. 

Source link