ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలు చూస్తే… గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండానికి పుష్పవతిని పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారికి ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. అంతా సజావుగానే సాగుతూ ఉన్నది. కానీ, రెండేళ్ల నుంచి వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత… భార్యను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇష్టం లేకుండా… బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో భార్య అతని నాలుకను బలంగా కొరికింది. దీంతో చంద్రానాయక్ నాలుక పైభాగంలో తీవ్ర గాయమైంది.