ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్లకు వాటి అమలు బాధ్యత అప్పగించారు. జిల్లా కలెక్టర్లు తమ కింద పనిచేసే జేసీలు, మైనింగ్ సిబ్బందిపై ఆధారపడటం తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని, మార్కెట్ మాఫియాల గురించి ఆలోచించలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల చెల్లింపుకు విధివిధానాలు, కరెంట్ అకౌంట్ల నిర్వహణ,సీనరేజీ వసూళ్ళపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో ఇప్పటికే ఇసుక వ్యాపారంలో ఆరితేరిన సిండికేట్లు మైనింగ్ సిబ్బందితో కుమ్మక్కై దందా మొదలు పెట్టేశాయి.