ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలు, తొలి రోజు 9 మంది నామినేషన్ లు దాఖలు-tg graduate teachers mlc election notification released first day candidates filed nominations ,తెలంగాణ న్యూస్

టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్ దాఖలు చేశారు. చాలిక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్, సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయా అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి నామినేషన్లను స్వీకరించారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డీఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Source link