ఎటువంటి గాయం కాకుండా ఆపానని అనుకున్నా
ఎంపీపై దాడి సంఘటన గురించి ప్రభాకర్ మాట్లాడుతూ… ఎంపీ సూరంపల్లి గ్రామంలోని ఒక కార్యకర్త ఇంటికి వెళ్లి వస్తుండగా రాజు చాలా దూకుడుగా ఎంపీ దగ్గరికి వచ్చాడు. వెంటనే తాను తన రెండు చేతులను పట్టుకొని, పక్కకు లాగానని, చూస్తే రాజు చేతిలో కత్తి ఉందన్నారు. వెంటనే ఆ కత్తిని లాగేసుకోగా, మరొక గన్ మ్యాన్ గంగారాం తనను రాజుని ఇంకా పక్కకు నెట్టుకెళ్లాడన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి ఎటువంటి గాయం కాకుండా తాను అపానని అనుకున్నానని, కానీ తాను తిరిగి ఎంపీ దగ్గరికి వచ్చేసరికి, తాను కడుపుని గట్టిగ పట్టుకోవడం, చేతి వేళ్ల మధ్యగా రక్తం కారడం గమనించానని అన్నారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా ఎంపీని అదే కారులో, గజ్వేల్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు.