జనసైనికుల స్టిక్కర్ల వార్
ఏపీలో ఇప్పుడు స్టిక్కర్ల వార్ నడుస్తోంది. పిఠాపురం పాటు భీమవరం, కాకినాడ, రాజోలులో ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తాలూకా అంటూ ఆయా పార్టీల మద్దతుదారులు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. సాధారణంగా అధికార పార్టీ మద్దతుదారులు ఈ విధంగా చేస్తుంటారు. పోలీసులు, ట్రాఫిక్, ఇతర సమస్యలు లేకుండా ఉండేందుకు , తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని పరోక్షంగా చెప్పుకుంటూ…తమ వాహనాలపై అధికార పార్టీ జెండాలు, నాయకుల ఫొటోలు పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఫలితాలు విడుదల కాకుండానే తమ అభ్యర్థి అంటూ స్టిక్కర్లు పెట్టుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా ఫలితాలు వరకూ వేచిచూడాలని, తొందర పనిచేయదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.