ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, సహాయక చర్యలకు ఆటంకాలు-రంగంలోకి ఆర్మీ, నేవీ-slbc tunnel accident rescue operations hampered army navy enter the field ,తెలంగాణ న్యూస్

మట్టి, బురద అడ్డంకులు

130 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్‌, 24 మంది హైడ్రా సిబ్బంది ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టన్నెల్ 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. దాదాపుగా అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీరు అడ్డంకులుగా మారాయి. హైకెపాసిటీ పంపింగ్‌ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నారు.

Source link