ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం… సరికొత్త సైబర్ నేరం…-new type of fraud in karimnagar money lost by calling toll free number ,తెలంగాణ న్యూస్

టోల్ ఫ్రీ నుంచి కాల్ తో ఖాతాలో డబ్బులు మాయం…

ఏటీఎం కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్ కు టోల్ ఫ్రీ నుంచి ఫోన్ వచ్చింది. ఏటీఎం కోసం కాల్ చేశారు కదా అంటూ మీకు ఓటీపీ నెంబర్ వచ్చింది చెప్పండని అడిగారు. అలా రెండు సార్లు ఓటిపి నెంబర్ రావడంతో టోల్ ఫ్రీ పేరుతో వచ్చిన కాల్‌ వాళ్ళకు చెప్పాడు. ఇంకే ముంది, శ్రీనివాస్ ఖాతా నుంచి 9 లక్షల 97 వేల 300 రూపాయలు మాయమయ్యాయి. ఈ సంగతి అప్పుడే గమనించని శ్రీనివాస్, కొద్ది రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్ళి ఖాతాలోని డబ్బుల గురించి వాకాబు చేయగా 997300 రూపాయలు లేవు. బ్యాంకు అధికారులను నిలదుస్తే సరైన సమాధానం రాలేదు. దీంతో మోసపోయిన శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు.

Source link