ఈ పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని ఏపీ తరఫు న్యాయవాది కోరడంతో ధర్మాసనం అనుమతించి, విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. విచారణ జరిపే వరకు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.