ఇది నేపథ్యం…
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజులు తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజులకు సంబంధించి కనిష్ఠంగా రూ.42,500, అంతకంటే ఎక్కువ ఫీజులు ఉంటే 10% పెంచుకోవడానికి వీలు కల్పిస్తామని సోమవారం హైకోర్టు తెలిపింది.