ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడో?- పంపిణీపై సమాచారం లేదంటున్న అధికారులు-ap new ration cards distribution date unclear officials say no information ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వేర్వేరుగా రేషన్ కార్డులు

ఆరోగ్యశ్రీ కార్డు పొందాలన్నా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలకు రేషన్‌ కార్డు తప్పనిసరి. ఇందుకోసం పలువురు రేషన్‌ కార్డులు కోరుకుంటున్నారు. విద్యార్థులకు కూడా రేషన్ కార్డు కీలకం. ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాల కోసం రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు…తాము వేరు కాపురాలతో ఉంటున్నామని రేషన్‌ కార్డులు వేర్వేరుగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా త్వరలో ప్రకటనలకు స్వస్తి చెప్పి రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Source link