ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్, జనవరి 1 నుంచి పెంచిన పింఛన్లు పంపిణీ-amaravati news in telugu ap govt hikes pension january 1st distribution starts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

జనవరి 3న కాకినాడలో సీఎం జగన్ పర్యటన

పింఛన్‌ కానుక కింద ప్రస్తుతం రూ.2750 ఇస్తున్నారు. ఈ పింఛన్ ను రూ.3 వేలకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన పింఛన్ల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని జనవరి 3న కాకినాడలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. అదే రోజు కలెక్టరేట్‌లలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

Source link