ఏపీలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్, తొలి విడతలో 161 ప్రభుత్వ సేవలు-ap govt starts whats app governance 161 services available to people on govt whats app number ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ప్రజాసమస్యలపై ఫిర్యాదులు

ప్రజలు తమ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు చేయవచ్చు. ప్రభుత్వ నెంబర్ కు మెసేజ్‌ చేస్తే, వెంటనే వారికి ఒక లింక్‌ పంపిస్తారు. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబర్, అడ్రస్, సమస్యలను టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నెంబర్ ఇస్తారు. దీని ఆధారంగా వారి సమస్య పరిష్కారం ఎంత వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. తమ ప్రాంతంలోని డ్రైనేజీ కాలవల లీకేజీలు, రహదారుల గుంతలు ఫొటోలు తీసి పంపవచ్చు. వాతావరణ కాలుష్యంపై వాట్సాప్ లో ఫిర్యాదులు చేయొచ్చు. ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, లబ్ధి గురించి వాట్సప్‌ నెంబర్ కు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.

Source link