ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదల-ap inter re verification result 2023 released check at resultsbieapgovin

ఇక ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,33,278 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,66,326 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 61 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను జూన్ 23న విడుదల చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. వీటి ఫలితాలను జులై 11వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు.

Source link