ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, జూన్ మొదటి వారంలో విడుదలకు ఛాన్స్!-amaravati ap eapcet 2024 results may release on june first week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఏపీ ఈఏపీసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగానికి అన్ని సెషన్లలో కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,58,373 మంది పరీక్ష రాశారు. 15,840 మంది గైర్హాజరు అయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 94.22 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అన్ని సెషన్లకు 88,638 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 80,766 మంది హాజరయ్యారు. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 7872 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్‌ 2024 మొత్తం 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 93.47 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు.

Source link