ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చిందోచ్, ముఖ్య తేదీలివే!-ap eapcet counselling schedule released online registration for july 24 to august 3rd

ముఖ్యమైన తేదీలు

  • జులై 24-ఆగస్టు 3 వరకు : ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు
  • జులై 25 – ఆగస్టు 4 వరకు : ధృవీకరణ పత్రాల పరిశీలన
  • ఆగస్టు 3- 8వ తేదీ వరకు : వెబ్ ఆప్షన్లు
  • ఆగస్టు 9 : వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు
  • ఆగస్టు 12 : సీట్ల కేటాయింపు
  • ఆగస్టు13-14 : కళాశాలల్లో రిపోర్టు చేయాలి
  • ఆగస్టు 16 : తరగతులు ప్రారంభం

ఈ ఏడాది ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ కు 3,14,797 మంది హాజరయ్యారు. వీరిలో 2,52,717 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,71,514 మంది విద్యార్ధులు (76.32 శాతం), అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది (89.65 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2,07,787 మంది అభ్యర్థులు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 1,10,887, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 16,056, నాన్ లోకల్ విభాగంలో 4009 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఓసీలు 1,05,556, బీసీ-ఏ 46,864, బీసీ- బీ2,221, బీసీ-సీ 61,126, బీసీ-డీ 17,235, బీసీ-ఈ 53,521 , ఎస్సీ, ఎస్టీలు కలిపి 11,383 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న, 2023న ఏపీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు తెలుగు రాష్ట్రాల్లో 25 జోన్లుగా విభజించి 136 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

Source link