కార్పొరేట్ లాయర్‌గా ఎంపికైన వారు విజయవాడ విద్యుత్‌సౌధలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌కో కు సంబంధించిన ఒప్పందాల రూపకల్పన, లీగల్ కేసులు పరిశీలించడం, రిమార్కుల రూపకల్పన, హైకోర్టు న్యాయవాదులతో చర్చించడం,అధికారుల ఆదేశాల మేరకు లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అన్ని పోస్టులు విజయవాడలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లో ట్రాన్స్‌కో ఛైర్మన్/ఎండీలకు చేరేలా పంపాల్సి ఉంటుంది.