ఇటీవల తెలంగాణ డీఈఈసెట్ ఫలితాలు విడుదల
డైట్ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫలితాలను అధికారిక వెబ్ సైట్ deecet.cdse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షలో చూస్తే… తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలు ఖరారు చేయనున్నారు. డీఈఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.. ఇందుకోసం జూన్ 1న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.