నేడో, రేపో డీఎస్సీ నోటిఫికేషన్
మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా, విధివిధానాలపై మంత్రి నారా లోకేశ్ కూడా సంతకం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం లభించింది. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు.