దీంతో కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు జలాశయాలలో అందుబాటులోని నీటిని తెలంగాణకు కేటాయించాలని బోర్డును కోరుతుంది. ఏపీ ఏటా అధికంగా నీటిని తీసుకుంటుందని వాదిస్తుంది. వేసవి అవసరాలను తీర్చడానికి తుంగభద్ర, సుంకేసుల, పులిచింతల, గాజులదిన్నె ప్రాజెక్టుల నుంచి 27 టీఎంసీల నీటిని తీసుకోవడానికి అనుమతించాలని తెలంగాణ పట్టుబడుతోంది.