ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీసం మద్దతు ధర లభిస్తుందని, శుక్రవారం సాయంత్రంలోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నాం.. రైతులెవరు ఆందోళన చందనవసరం లేదని చెప్పారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు. వాతావరణ మార్పులతో 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ… నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుందని, రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగమంతా రాత్రి పగళ్లూ కష్టపడుతుందన్నారు.