ఇంటింటికీ సచివాలయ సిబ్బంది
ఈ క్యాంపుల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఏ సర్టిఫికెట్లు ఇస్తారు, ఇతర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు సిబ్బంది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి శిబిరాలకు రప్పించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. జూన్ 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సచివాలయ సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారు. ప్రతి మండలంలో రెండు టీమ్ లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టీమ్ లో ముగ్గురు అధికారులు ఉంటారు. 24 గ్రామాల కన్నా ఎక్కువ ఉంటే మూడు టీమ్ లను ఏర్పాటు చేయవచ్చు. ఎక్కువ వార్డు సచివాలయాలు ఉండే నగరాలు, సిటీలకు దగ్గరగా ఉంటే సచివాలయం క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తారు. దీనిలో ఐదు వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ క్యాంపుల పర్యవేక్షణకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు నియమిస్తారు.