స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిని అనర్హులుగా పరిగణించే నిబంధన రద్దు చేయాలనే డిమాండ్ నేపథ్యంలో చట్ట సవరణకు శాసనసభ అమోదం తెలిపింది. మునిసిపల్, పంచాయితీరాజ్ చట్ట సవరణలకు సభ అమోదముద్ర వేసింది. పురపాలక, పంచాయితీరాజ్ చట్ట సవరణలకు గెజిట్ జారీ కావడంతో అవి అమల్లోకి వచ్చాయి.