కొద్దిరోజులుగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్, ఆమె తన బేబీ బంప్ ని ఎవ్వరికి కనిపించకుండా దాచేస్తుంది. దీపికా పదుకొనె తల్లవుతున్న శుభవార్తను రణ్వీర్ సింగ్ అందరితో పంచుకున్నా.. కత్రినా కైఫ్ కానీ విక్కీ కౌశల్ కానీ పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని అందరితో చెప్పకుండా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారన్నారు.
ఈమధ్యన కత్రినా బయట కనిపించినప్పుడు ఆమె బేబీ బంప్ కనిపించని అవుట్ ఫిట్ వేసుకుంది అంటూ ఆ ఫొటోస్ ని వైరల్ చేసారు చాలామంది. అయితే తాజాగా విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ పై స్పందించాడు. తల్లితండ్రులమయ్యే శుభ ఘడియలు ఎప్పుడు వచ్చినా అందరికీ మేమె స్వయంగా చెబుతాను. మేము ఆ విషయాన్ని ప్రకటించడానికి ఎటువంటి సిగ్గుపడము అంటూ కత్రినా ప్రెగ్నెన్సీపై విక్కీ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ కొన్నేళ్లు సీక్రెట్ గా లవ్ చేసుకుని పెళ్లి కూడా హడావిడి లేకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అందుకే అందరూ కత్రినా ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా విక్కీ జంట దాచేసింది అనుకున్నారు. కానీ విక్కీ కౌశల్ కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్ పై బ్యాడ్ న్యూజ్ సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు.