కరీంనగర్‌లో 24గంటల తాగునీటి సరఫరా..జనవరి 24న ప్రారంభం, ఏర్పాట్లు పరిశీలించిన బండి సంజయ్-24hour drinking water supply in karimnagar to start on january 24th bandi sanjay inspects the arrangements ,తెలంగాణ న్యూస్

ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్…

కేంద్ర మంత్రి ఖట్టర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంబేద్కర్ స్టేడియం వద్ద నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, మార్వాడీ గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్ ప్రాంతాలను సందర్శించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి ఖట్టర్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు.

Source link