కరీంనగర్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జంపింగ్ లు-karimnagar political equation changing congress brs leaders shifting each other party ,తెలంగాణ న్యూస్

బీఆర్ఎస్ టు కాంగ్రెస్

ముందు నుంచీ కరీంనగర్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేయడానికైనా సిద్ధమని, కేసీఆర్ నియంతృత్వ పోకడలను భరించలేకనే పార్టీని వీడుతున్నానని పలు వేదికలపై నుంచి ప్రచారం ప్రారంభించిన సంతోష్ కుమార్ ఎట్టకేలకు…కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రోజు నుంచి సంతోష్ ను తమ పార్టీ నుంచి పోటీచేయాలని, బీజేపీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ పార్టీలు కోరగా, తాను ఇండిపెండెంట్ గానే పోటీచేస్తానని చెప్పారు. అయితే ఇటీవలే కరీంనగర్ లో జరిగిన రాహుల్ గాంధీ పాదయాత్ర సమయం నుంచి తమ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంతోష్ తో టచ్ లో ఉండగా, తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావు ఠాక్రే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో బరిలో ఉండాల్సిన నాయకులిద్దరూ పార్టీలు మారడంతో ఇంకా ఎన్ని మార్పులు శరవేగంగా మారుతాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Source link