కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఐ సై, మూడు సీట్లు కేటాయించాలని పట్టు-congress cpi leaders discuss coalition in ts assembly elections demands three seats ,తెలంగాణ న్యూస్

Congress CPI : సీఎం కేసీఆర్ హ్యాండివ్వడంతో వామపక్షాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. తమకు నాలుగు స్థానాలు కేటాయిస్తే పొత్తుకు సిద్ధమని నేతలు ప్రకటిస్తున్నారు. సీపీఐ నేతలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో చర్చలు మొదలుపెట్టారు. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలపై సీపీఐ గురిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ రెండు సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులకు పావులు కదుపుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాక్రే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాము పోటీ చేసే స్థానాలను ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, హుస్నాబాద్‌, కొత్తగూడెం, మునుగోడు స్థానాలలో మూడు స్థానాలను కేటాయిస్తే కాంగ్రెస్‌ తో పొత్తుకు సిద్ధమని కూనంనేని సాంబశివరావు అన్నట్లు తెలుస్తోంది.

Source link