కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే బియ్యం, నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించొద్దని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్) ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒకవేళ బియ్యం ఎగుమతులను అడ్డుకుంటే, అది కేంద్ర ప్రభుత్వానికి, విదేశీ ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించడం అవుతుందని స్పష్టం చేసింది.