జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాం
జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స, అత్యాధునిక స్టెమ్ సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా, రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగ్గా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇందులో కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, సిడ్నీ రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, జూబ్లీ హిల్స్- అపోలో హాస్పిటల్స్ సీఈఓ తేజస్వి రావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.