Kumari Aunty Food Stall : స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ సమస్య విషయంలో తాజాగా ఆమెపై కేసు నమోదు చేసిన కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని ప్రకటించారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.