అయితే కువైట్‌కు వెళ్లడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. టికెట్లు, పాస్‌పోర్టు, వీసా అంటూ అనేక ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆయితే ఆ ఖర్చులకు కూడా శ్రీనివాసుల వద్ద డబ్బులు లేవు. దీంతో రైల్వే కోడూరు మండలం సూరపురాజుపల్లిలో ఉన్న సొంత ఇంటిని అమ్మేశాడు. ఆ డబ్బులతో భార్య, భర్తలిద్దరూ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.