కృష్ణమ్మ అలలపై 120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణం.. పర్యాటకులకు కార్తీకమాసం కానుక!-boat trip from nagarjunasagar to srisailam begins under the auspices of telangana tourism ,తెలంగాణ న్యూస్

శ్రీశైలం వరకు (120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు 2 వేల రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయల టికెట్‌ ధర నిర్ణయించారు. ఒకవైపు మాత్రమే. ఇది కేవలం జ‌ర్నీకి సంబంధించిన రుసుము మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలంలో రూమ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ వంటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడిపిస్తారని టూరిజం ఆఫీసర్ కే. వెంకటరమణ వివరించారు.

Source link