ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలతో పాటు ఇతర అనాథ బాలల సంక్షేమానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనాథల సంరక్షణపై ప్రస్తుతం ఉన్న వేర్వేరు ఉత్తర్వులను ఒకే విధానం కిందకు తీసుకువచ్చేందుకు, వారి సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పలు సిఫార్సులు చేసింది.